కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం “రామకృష్ణా నగర్” లో వేంచేసి ఉన్న “కృష్ణాలయం ” లో యాదవ్ సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో పురాతన సంస్కృతిని కొనసాగిస్తూ, శ్రీ మహావిష్ణుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచి చలిని సైతం లెక్కచేయకుండా తలారా స్నానం చేసి
కృష్ణాలయంలో శ్రీకృష్ణుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలకరించిన పల్లకిలో ఉంచి గ్రామ పురవీధిలలో ఊరేగిస్తూ”హరేరామ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే ” నామ స్మరాలతో సంకీర్తనలు పాడుకుంటూ, దైవ భక్తితో భజనలు చేసుకుంటూ పెద్దలు,చిన్న పిల్లలు సైతం ఎంతో ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలనుండి నిర్వహిస్తున్నారు…
ఈ, దైవ కార్యక్రమంలో గ్రామ నలుమూలల నుండి భక్తులు పాల్గొని నెలరోజులు పాటు సంకీర్తనలు పాడుకుంటూ స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తామని “కృష్ణాలయం కమిటీ హరేరామ సంకీర్తనలు” గురువుగారు “బొడ్డపు నూకరాజు”గారు BHARATH AAWAZ NEWS కి తెలియజేయడం జరిగింది…
ఈ కార్యమంలో ఉప్పుల చిన్నశ్రీను, పెద్ద శ్రీను, చిడగల చినగంగరాజు, గజ్జి కృష్ణ, ఐతు రాజుబాబు, ఇసరపు హరీష్, పీతల శివకృష్ణ పాల్గొన్నారు…
#BABJIDADALA
