Rss హిందు యాంకర్
హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ విమర్శించారు. విభజన కొనసాగడం వల్ల హిందువులు ఇప్పటికే బలహీనపడ్డారని భవిష్యత్తులో మరింత దారుణంగా పరిస్థితి మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఇందుకోసం హిందువులందరినీ జాగృత పరుస్తూ అన్ని ప్రాంతాల్లో సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనం వాయిస్
హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో అరండల్ పేట అంకమ్మ తల్లి బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సమయంలో ప్రధాన వక్త గా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ మాట్లాడుతూ హైందవ మతాన్ని బలహీనపరిచేందుకు శతాబ్దాలుగా సాగిన పాలకుల దుశ్చర్యలను ఖండించారు.
కులాల పేరిట హిందూ ధర్మాన్ని సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల జాగృత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి ధర్మం ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ 100 వసంవత్సరంలో ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లో ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హిందువులంతా ఐక్యంగా సంస్కృతి పై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూ సమ్మేళన ఆవశ్యకతను వివరించారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాది చొప్పర వెంకటేశ్వరరావు గురుభవాని నిమ్మని శివయ్య, మాదిరాజు ఉమా పి ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
