Home South Zone Andhra Pradesh నేషనల్ కెమికల్ లాబొరేటరీ లో ఉద్యోగాలు! |

నేషనల్ కెమికల్ లాబొరేటరీ లో ఉద్యోగాలు! |

0

కర్నూలు :
సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థల్లో ఒకటైన నేషనల్ కెమికల్ లాబొరేటరీ (ఎన్సీఎల్).. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ/ ఐటీఐలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షలతో నియామకాలుంటాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారికి రాత పరీక్ష ఉంటుంది.1. టెక్నీషియన్ఖాళీలు: 15అర్హత: పదోతరగతి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ / కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఫిట్టర్ / ప్లంబర్ / రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ / ఎలక్ట్రీషియన్ / వైర్‌మెన్ / డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్‌తో 55 శాతం మార్కులతో ఐటీఐ పూర్తిచేయాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.వేతన శ్రేణి: నెలకు రూ. 19,900 – 63,200.పరీక్ష: ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది.

ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పదో తరగతి + ఐటీఐ స్థాయిలో ఉంటుంది. మూడు పేపర్లు ప్రత్యేక వ్యవధుల్లో ఉంటాయి.పేపర్-1: మెంటల్ ఎబిలిటీ టెస్టు 50 ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు రెండు మార్కులు. రుణాతక మార్కులు లేవు. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జిమెంట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 60 నిమిషాలు.పేపర్-2: జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వ్యవధి 30 నిమిషాలు.పేపర్-3: సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 ఉంటాయి. ప్రశ్నకు మూడు మార్కులు.

ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వ్యవధి 90 నిమిషాలు.2. టెక్నికల్ అసిస్టెంట్పోస్టులు: 19అర్హత: కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌తో డిప్లొమా, రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో బీఎస్సీ, ఏడాది అనుభవం ఉండాలి. విద్యార్థుల డిగ్రీని 60 శాతంతో పూర్తిచేయాలి.వేతన శ్రేణి: నెలకు రూ. 35,400 – 1,12,400.పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్‌లలో 200 మార్కులకు ఉంటుంది. డిప్లొమా/ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.పేపర్-1, పేపర్-2 టెక్నీషియన్ పరీక్ష మాదిరిగానే ఉంటాయి.

పేపర్-3: సబ్జెక్టు సంబంధిత 100 ప్రశ్నలకు 300 మార్కులు. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.సన్నద్ధతరెండు పోస్టులకు పేపర్-3లో సబ్జెక్టు సంబంధిత అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యాంశాలను అధ్యయనం చేసి పునశ్చరణ చేసుకుంటే ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.పేపర్-1లో ఉత్తీర్ణత కోసం వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.ప్రతి పేపర్‌కూ వేర్వేరు సమయాలు ఉన్నాయి.

నిర్ణీత వ్యవధిలోగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.రుణాత్మక మార్కుల కారణంగా తెలిసిన ప్రశ్నలకే జవాబులు రాయాలి.వివరాలువయసు: 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ – ఎన్సీఎల్ కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.దరఖాస్తు ఫీజు: అన్రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 500. మహిళలు / ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2026వెబ్‌సైట్: https://recruit.ncl.res.in/

NO COMMENTS

Exit mobile version