కర్నూలు: డోన్ : బేతంచర్ల :
బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి గౌరవనీయులు డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు హాజరై, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉత్సవాల సమయంలో భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే VIPల కంటే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంగా తెలిపారు.
