కర్నూలు :
కర్నూలు జిల్లా :* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు వాహానాల డ్రైవర్లకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలోని నేషనల్ హైవేల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.వాహనాలను అతి వేగంతో నడపకూడదని, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకూడదనిన పోలీసు అధికారులు ఆయా వాహనాల డ్రైవర్లకు తెలియజేస్తున్నారు.
