బిగ్ బ్రేకింగ్!
రాహుల్ ఫెయిల్ అయ్యాడు, ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి: కాంగ్రెస్‌లో ఊపందుకున్న డిమాండ్
ప్రియాంక గాంధీ “పెద్ద పదవి”కి అన్ని విధాలా అర్హురాలు అంటూ బాంబ్ పేల్చిన రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్‌లో ముదురుతున్న నాయకత్వ పోరు. రాహుల్ – ప్రియాంక వర్గాలుగా చీలిపోయిన పార్టీ
మొన్న శీతాకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ ఉపన్యాసం పలువురిని ఆకట్టుకుంది. రాజకీయంగా కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా చాలాసార్లు అందుబాటులో ఉండకపోవడం, ప్రచారం చేసిన ప్రతిచోటా కాంగ్రెస్ ఓటమి పాలవడంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది.
సీనియర్ పాత్రికేయురాలు స్వాతి చతుర్వేది నిన్న ఇదే అంశం గురించి ఎన్‌డీ టీవీ వెబ్‌సైట్లో రాస్తూ రాహుల్ తరచూ అందుబాటులో లేకుండా పోవడం, పార్టీకి సమయం ఇవ్వకపోవడం వల్ల పార్టీ సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నారని, వారు ప్రియాంకా గాంధీని తెరమీదికి తేవాలనుకుంటున్నారని రాసింది.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీని ప్రధాన మంత్రి చేస్తే ఇందిరా గాంధీ లాగా శక్తివంతమైన నేతగా పరిపాలిస్తారని అన్నారు.
ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా “పెద్ద పదవి”కి అన్ని విధాలా అర్హురాలు అనడం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.
