Home South Zone Andhra Pradesh కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్ |

కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్ |

0

కిట్స్ కళాశాలలో మూడు రోజుల ఐఓటి హేకతాన్ స్థానిక కే కే ఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) లో ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు ఐ ఓ టి మీద మూడు రోజుల హేకతాన్ మేక్సిల్డ్ మాస్టర్ ట్రైనర్ మిస్టర్ కే రేవంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో లో 2వ సంవత్సరం ఐటి ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిస్టర్ అజయ్, సీఈవో, ఫౌండర్ ఆఫ్ బిట్ అలర్ట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27 టీమ్స్ పాల్గొనగా అందులో ఐదు బెస్ట్ థీమ్స్ గా సెలెక్ట్ కాబడినవి.

ఈ బెస్ట్ టీమ్ కు 12000 క్యాష్ ప్రైస్ గా ఇవ్వడం జరిగినది. అందులో మొదటి ప్రైజ్ గ్యాస్ పొజిషనింగ్ సిస్టంకు, రెండవ ప్రైజ్ పబ్లిక్ ట్యాంకర్ మానిటరింగ్ కు, మూడవ ప్రైస్ హోమ్ ఎనర్జీ ట్రాకర్, నాలుగో ప్రైస్ ప్రెషర్ కుక్కర్ కు మరియు ఐదో ప్రైస్ స్మార్ట్ ఫార్మింగ్ కు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ కోయి సుబ్బారావు గారు మాట్లాడుతూ కళాశాల నందు స్ట్రాంగ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నదని వివరించారు. మా కళాశాలలో ప్రతి విద్యార్థికి కొత్త ఆలోచన చేయడానికి, ప్రయోగాలు చేపట్టడానికి, సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి పూర్తిస్థాయిలో

ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు. కళాశాల సెక్రటరీ శ్రీ కోయ శేఖర్ గారు మాట్లాడుతూ ఇన్నోవేషన్స్ ఈ తరానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం అని వివరించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారు మాట్లాడుతూ ఈ కాలంలో కొత్త ఆలోచనలు మాత్రమే భవిష్యత్తును నిర్మించగలరని అన్నారు.

అదేవిధంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ హరిబాబు గారు మాట్లాడుతూ ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పుకు ఆరంభం అని కొనియాడారు. ఈ సందర్భంగా బహుమతులు గెలుచుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, డిపార్ట్మెంట్ ఐటి హెచ్ ఓ డి ఎం ఎస్ ఎస్ సాయి గారు మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ప్రిన్సిపాల్

NO COMMENTS

Exit mobile version