రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు.
థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో భారత్ తరుపున పాల్గొన్న శశాంక్ టీం సిల్వర్ మెడల్ గెలుచుకోవడంపై సిఎం చంద్రబాబు అభినందించారు.
గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వేస్టేరియన్ ఈవెంటింగ్ క్రీడలో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ ముఖ్యమంత్రికి తెలిపారు.
భారత్ తరుపున పాల్గొన్న తమ టీంకు సిల్వర్ మెడల్ వచ్చిందని శశాంక్ వివంరించారు. భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
