కర్నూలు:
కర్నూలులో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి నిర్వహించిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో, బ్లాక్ స్పాట్స్ వద్ద బ్యారికేడింగ్, సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
జాతీయ, రాష్ట్ర రహదారులపై పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, అధిక లోడుతో వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకు శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
