Home South Zone Andhra Pradesh క్రిస్మస్ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ నుంచి |

క్రిస్మస్ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ నుంచి |

0

*గుంటూరు జిల్లా పోలీస్క్రి

స్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు మరియు సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు,.

ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం మరియు త్యాగ సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ఎల్లప్పుడూ ఆచరణీయమైనవని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం మరియు త్యాగం వంటి విలువలు సమాజాన్ని
మరింత బలపరుస్తాయని ఆయన తెలిపారు.

ఈ క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version