Home South Zone Andhra Pradesh మొబైల్ యాప్‌తో సమగ్ర కుటుంబ సర్వే |

మొబైల్ యాప్‌తో సమగ్ర కుటుంబ సర్వే |

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సంక్షేమ పథకాలు మరియు ప్రజా యోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో నిర్వహిస్తున్నారు.

ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు,నివాస పరిస్థితిలో ఆదాయం, ఉపాధి,విద్యా ,ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు సర్వే ద్వారా సేకరించిన డేటాను ఆధారంగా చేసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి,ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నారు.

అలాగే ప్రభుత్వ వివాహ విభాగాలు అమలు చేస్తున్న ప్రజా సేవల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక,డేటా ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టి భవిష్యత్తులో విధాన నిర్ణయాలను ఈ సమాచారాన్ని కీలకంగా ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NO COMMENTS

Exit mobile version