కనకమేడల రవీంద్ర కుమార్‌కు దేవినేని ఉమామహేశ్వర రావు అభినందనలు
విజయవాడ: 25 డిసెంబర్ 2025
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం విజయవాడ నగరంలోని కనకమేడల రవీంద్ర కుమార్ గారి కార్యాలయం వెళ్లిన దేవినేని ఉమామహేశ్వర రావు గారు మర్యాదపూర్వకంగా కలుసుకుని, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ రంగంలో కనకమేడల రవీంద్ర కుమార్ గారు సాధించిన ఈ గౌరవం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.




