ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం
జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను నివాళి
*మైలవరపు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా రంగా 37వ వర్ధంతి*
విజయవాడ, డిసెంబర్ 26: ప్రజల హృదయాల్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగారావుకు చెక్కుచెదరని స్థానం ఉందని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం విద్యాధరపురం సితార వి ఎం రంగా చౌక్ సెంటర్లో 44, 45 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి.
మైలవరపు మాధురి లావణ్య, తెలుగుదేశం నాయకులు మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి ఉదయభాను నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా స్వర్గీయ వంగవీటి రంగా నిలిచి ఉన్నారని కొనియాడారు. ఆయన పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారని అన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపించిన మహా నాయకుడు వంగవీటి మోహన రంగాను ప్రజలు ఎల్లకాలం
గుర్తుంచుకుంటారని అన్నారు. రంగా ఆశయాల సాధనకై కృషి చేస్తామని ఉదయభాను చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు మహదేవు అప్పాజీరావు, బుల్ల విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర, మరుపిళ్ళరాజేష్, అత్తలూరి పెద్దబాబు.
ఉమ్మడి చంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గునుకుల పుల్లయ్య, చింతలపూడి సత్యనారాయణ, మిర్యాల వెంకటేశ్వరరావు, సుంకర కృష్ణ , మైలవరపు వీరబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు.
