కర్నూలు
ఘనంగా మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు …భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే దస్తగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీఎస్ నాగరాజు, రామస్వామి, సీనియర్ నాయకులు కొట్టె చెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, సీనియర్ బీజేపీ నాయకులు సుధాకర్ తో పాటు మహిళా సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన చూపిన స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను యువత పుణికి పుచ్చుకోవాలని అన్నారు.
