పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మండలానికి సంబంధించిన తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక వద్దకు శనివారం ఉదయం ఒంటరి ఏనుగు చేరుకున్నట్లు స్థానికులు గుర్తించారు.
గత కొన్ని రోజులుగా ఈ ఏనుగు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసి రైతులకు అపార నష్టం కలిగించింది. ప్రస్తుతం ఏనుగు పులిచెర్లలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో కల్లూరు, పాలెం, దేవళంపేట, కమ్మపల్లి పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ తెలిపారు# కొత్తూరుమురళి.
