కర్నూలు :
27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
కర్నూలు నగరంలోని మంత్రి కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ సందర్భం గా పంపిణీ మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు.
కర్నూలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 133 మందికి రూ.1,26,31,142ల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయడం జరిగిందని తెలియజేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందాని పేర్కొన్నారు.
