దస్తురాబాద్, డిసెంబర్ 28 మారు మూల గ్రామాలకు మెరుగైన రోడు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన లింక్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు నిధుల లేమితో మధ్యలోనే నిలిచిపోయాయి.
భూత్కూర్ నుంచి పెర్కపల్లె గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన శాఖ ద్వారా రూ.1.11కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మట్టి చదను చేసి, మొరం పోసి, కొన్ని చోట్ల పైపులు వేసి పనులు ఆపేశారు. రెండేళ్లుగా రో డ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది.
కొత్త ప్రభు త్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా పనులు తిరిగి ప్రారంభం కాలేదు. రోడ్డు పూర్తి చేయా లని ప్రజలు, రైతులు కోరుతున్నారు. సంబం ధిత ట్రైబల్ ఏఈ శ్రీవర్ధన్ను వివరణ కోరగా నిధులు లేక పనులను నిలిచినట్లు తెలిపారు.
#Shivaji
