ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వేకోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
