శాసనమండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేశ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం రూ. 4064.59 కోట్ల బకాయిలు పెట్టిందని ఆధారాలతో సహా వెల్లడించారు.
నిజాలు భరించలేక వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారిందని, ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ. 500 కోట్ల బకాయిలు చెల్లించిందని, చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
