Home South Zone Telangana మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్ |

మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్ |

0

వాస్తవానికి కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. నగరంలో జోష్ ఎంత ఉంటుందో, పోలీసుల పహారా అంతకు మించి ఉంటుంది. అయితే, ఎప్పుడూ లాఠీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో సీరియస్‌గా ఉండే పోలీసులు.. ఈసారి పంథా మార్చారు. లాఠీ దెబ్బల కంటే మాటల తూటాలే బలంగా పనిచేస్తాయని భావించారో ఏమో గానీ, హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు.

హైదరాబాద్ నగరం అంతటా న్యూఇయర్ జోష్ నెలకొంది.. డిసెంబర్ 31వ తేదీ నాడు.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా మంది ప్రిపేర్ చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో న్యూఈయర్ సెలబ్రేషన్స్ వేళ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే మందుబాబులకు, ఆకతాయిలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీల పేరుతో హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని..

వేడుకలను చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోకుండా జాగ్రతగా ఉండాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘క్యాబ్’ ఎక్కుతారా.. ‘కోర్టు’ మెట్లెక్కుతారా? అంటూ సజ్జనార్ ప్రశ్నించారు.. దీనికి సంబంధించిన ట్వీట్ లు నెట్టింట వైరల్ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జనర్ తన ఎక్స్ ఖాతాలో చేసిన మూడు వేర్వేరు ట్వీట్లు ఇప్పుడు మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూన్నాయి.. అలాగే.. జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి..

‘లాయర్’ను వెతకడం కంటే.. గూగుల్‌లో ‘క్యాబ్’ను వెతకడం మిన్న!
సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో సీపీ స‌జ్జన‌ర్ చేసిన ట్వీట్ యువతను ఆకర్షిస్తోంది. “మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు” అంటూ స్నేహపూర్వకంగా చెబుతూనే.. “గూగుల్‌లో లాయర్ కోసం వెతకడం కంటే, క్యాబ్ కోసం వెతకడం మంచిది”

అని చురకలంటించారు. చలాన్లు, జైలు శిక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని, సంబరాలను బాధ్యతయుతంగా జరుపుకోవాలని హితవు పలికారు. లేదంటే ‘యాక్షన్ గ్యారెంటీ’ అని తేల్చిచెప్పారు.

#Sivanagendra

NO COMMENTS

Exit mobile version