APSRTC(PTD) ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.(ఏఐటీయూసీ అనుబంధం).
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ లో 8000 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. గౌ.ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి అన్ని విధాలుగా ఔట్ సోర్సింగ్ కార్మికులు సహకరిస్తూ, పథకాన్ని విజయవంతం చేసే దిశలో కార్మికులు ముందున్నారు…
కానీ వీరికి కాంట్రాక్టర్లు ద్వారా వేతనాలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఈ కాంట్రాక్టర్ల దోపిడీలు వలన కార్మికులు చాలా నష్టపోతున్నారు.సమస్యలపై గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి, యాజమాన్యానికి క్షుణ్ణంగా పలు దఫాలుగా తెలియజేయడం జరిగింది. కానీ ఏ విధమైన న్యాయం జరుగలేదు. వీటిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఏఐటీయూసీ అనుసంధానంగా రాాష్ట్ర వ్యాప్తంగా వున్నటువంటి 26 జిల్లాల్లో కార్మికులు
ఉద్యమబాట పట్టుటకు శ్రీకారం చుట్టనున్నారు. నిర్ణయానుసారం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేక్షన్లలో పనిచేసే ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేయుటకు వెనుకాడబోమని కర్మికలోకం ప్రకటన చేస్తూ,స్పష్టంచేయడం జరుగుతుంది.
APSRTC ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ.
