మెదక్ జిల్లా కలెక్టర్ నూతన సంవత్సరం సందర్బంగా అధికారులు ప్రజాప్రతినిధులు,ప్రజలు బొకేలు,శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని అయితే వాటికి బదులుగా పేద విద్యార్థులకు
ఉపయోగపడేలా శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చలి నుంచి రక్షణ పొందే దుప్పట్లు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలనీ వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.పేద పిల్లలకు చలి నుంచి రక్షణగా చలి కాలం దుప్పట్లు అందిచడం వలన వారి ఆరోగ్యరక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు.
