Home South Zone Andhra Pradesh పోలీసు శిక్షణ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగాలు |

పోలీసు శిక్షణ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగాలు |

0

కర్నూలు : కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మరియు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్ లో650 మంది ట్రైన్ కానిస్టేబుల్ లు శిక్షణ పొందుతున్నారు. వీరి కోసం 9 నెలల పాటు పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన స్వీపర్లు స్కావెంజర్స్ హెల్పర్స్ దోబీలు బార్బర్లు మరియు ఇతర హెల్పింగ్ పనులు చేసేందుకు వ్యక్తులను సరఫరా చేయడానికి ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సివిల్ ఏపీఎస్పీ పోలీస్ విభాగాలు

సోమవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎస్పీ కర్నూల్ బెటాలియన్ లో ఒప్పంద ప్రాతిపదికన పని చేసేందుకు స్వీపర్లు 6 పారిశుద్ధ కార్మికులు 6,  డైనింగ్ హాల్ సహాయకులు 4,  దోబి చాకలి 3,  మంగలి 3 మొత్తం  22 మందిని సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న ఏజెన్సీలు ముందుకు రావాలని

కామెండెంట్ దీపిక పాటిల్ తెలియజేశారు. అలాగే జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు 3,  మెస్ సహాయకులు 2,  దోబి 1,   బార్బర్  1, మొత్తం 11 మందిని సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న ఏజెన్సీ కంపెనీలు పూర్తి వివరాలతో పని దినాలలో బెటాలియన్ కమాండ్మెంట్ లేదా  జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలని ప్రకటనలో తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version