Home South Zone Telangana అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లడంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు |

అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లడంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు |

0

అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలీదని..

ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రిని జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ..

కేసీఆర్, తాను మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు.

అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆపై వేరే విషయాలపై మీడియాతో సీఎం మాట్లాడుతూ.

. అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు యాక్సెస్ కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలలకు సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల వరకు మండలిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

NO COMMENTS

Exit mobile version