Home South Zone Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ |

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ |

0

గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra pradesh High Court) కొట్టివేసింది. గ్రూప్ -2 రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం రోజు తీర్పు ఇచ్చింది.

2023 గ్రూప్ -2కు సంబంధించి రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు (AP Group – 2 Notification) చేయాలని పిటిషన్‌లో కోరారు
అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మేరకు రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని.. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయస్థానం అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణను ఆపాలంటూ అప్పట్లోనూ కొంతమంది పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టు నిరాకరించరింది. పరీక్షను నిలిపివేస్తే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడింది. అలాగే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఆధారంగా.

తదుపరి చర్యలన్నీ తమ తీర్పునకు లోబడే ఉంటాయని అప్పట్లో స్పష్టం చేసింది. మరోవైపు గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు 92 వేల 250 మంది అర్హత సాధించారు. అయితే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ మీద కొంతమంది అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన వారిలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు అర్హత సాధించింది ఇద్దరే.

దీంతో గ్రూప్ 2 మెయిన్ పరీక్షను ఆపేస్తే మిగతా అర్హులైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటూ మెయిన్ పరీక్షను నిలిపివేసేందుకు ఏపీ హైకోర్టు అప్పట్లో నిరాకరించింది. తాజాగా గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కూడా ఏపీ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో.. గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట లభించనుంది.

NO COMMENTS

Exit mobile version