2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల
ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.
