కర్నూలు : కోడుమూరు : టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుండే ఉత్తమ కార్యకర్తలను కోడుమూరు
ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఘనంగా అభినందించారుఈ సందర్భంగా ఆయా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందజేస్తూ వారి సేవలను కొనియాడారు.
పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే పునాది అని, వారి అంకితభావం, నిబద్ధత వల్లనే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
