మదనపల్లె బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన స్థానికులు ఆగ్రహంతో నిందితుడిపై పిడిగుద్దులతో దాడి చేశారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని గుంపు నుంచి రక్షించారు. ఉద్రిక్తత దృష్ట్యా భారీగా బలగాలను మోహరించి, నిందితుడి ఇంటి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు భారీగా నిరసన చేపట్టారు.
