గాలివీడు మండలం మాధవరం గ్రామంలోని కంచరపల్లి బీటీ రోడ్డు పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నాయకుడు కసినేని మహీంద్రా నాయుడు, సారధి రాజు మరియు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
