వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కలగడం ఎంతో అదృష్టంగా భావించానని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి
సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.ఈ పవిత్ర సందర్భంగా వైకుంఠ ఏకాదశి పవిత్రత ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సద్గుణాలు, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.




