*గుంటూరు జిల్లా పోలీస్..
బీటెక్ చదువుకుని, బెట్టింగులకు బానిసై, వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన కొల్లిపర పోలీసులు,./
నాలుగు వరుస దొంగతనాల కేసుల్లో 16,00,000/-లు విలువైన 96 గ్రాముల బంగారు ఆభరణాలు,500 గ్రాముల వెండి ఆభరణాలు మరియు రూ. 5,000/- చోరీ సొత్తు రికవరీ.*
సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర దర్యాప్తు జరిపి,దొంగతనం జరిగిన 10 రోజుల్లోనే దొంగను పట్టుకున్న కొల్లిపర ఎస్సై S.V. ప్రసాద్ గారు.*
వరుస దొంగతనాల కేసుల నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసి, చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేసిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్ గారిని, కొల్లిపర ఎస్సై ప్రసాద్ గారిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.*
ఈరోజు(31.12.2025) జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వరుస దొంగతనాల నిందితుడి అరెస్ట్ గురించిన వివరాలు వెల్లడించిన గౌరవ జిల్లా ఎస్పీ గారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నంగి గ్రామానికి చెందిన మర్రి శివగోపి ఈ నెల 19వ తేదీన ఉదయం తన ఇంటికి తాళం వేసి, తాళం చెవిని ముగ్గు గిన్నెలో పెట్టి పొలం పనికి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపుకు వేసిన తాళం తీసి ఉండటం, ఇంటి లోపలకి వెళ్ళి చూడగా బీరువా కూడా తెరిచి అందులో ఉన్న రూ.2,35,000/- విలువ గల 60 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ. 5,000/- నగదును ఎవరో గుర్తు తెలియని వారు దొంగిలించుకుని పోయారని గ్రహించి.
ఈ ఘటనకు సంబంధించి అదే రోజు కొల్లిపర ఎస్సై ప్రసాద్ గారికి ఫిర్యాదు చేయగా, సదరు ఫిర్యాదుపై Cr.No.172/2025 u/s 331(3), 305(a) BNS ఆఫ్ కొల్లిపర పోలీస్ స్టేషన్ కింద కేసు నమోదు చేసి, తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్ గారి పర్యవేక్షణలో తెనాలి రూరల్ సీఐ Sk నాయబ్ రసూల్ గారి దిశా నిర్దేశంలో కొల్లిపర ఎస్సై గారు సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ దర్యాప్తులో ముసుగుతో ఉన్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైకుపై తిరగడాన్ని సీసీ కెమెరాలు ద్వారా గమనించి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వివరాలను తెలుసుకుని ఆరా తీయగా ఈ దొంగతనానికి పెనుగొండ మల్లికార్జున రెడ్డి @ మల్లి s/o శ్రీనివాస రెడ్డి, వయస్సు: 23 సం.లు భీమవరం గ్రామం, వత్సవాయి మండలం, NTR జిల్లా అనే వ్యక్తి పాల్పడినాడని తెలుసుకుని, అతన్ని అరెస్ట్ చేసి విచారించడం జరిగింది.
ఈ విచారణలో మున్నంగిలో జరిగిన దొంగతనాన్ని తానే చేసినట్లు అంగీకరించి, దీనితో పాటు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు, మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసినట్లు చెప్పడం జరిగింది. *మిగిలిన మూడు దొంగతనాల వివరాలు :* 1. 23.11.2025న తెనాలి రూరల్ పీఎస్ పరిధిలోని కటేవరం గ్రామంలో, ఉదయకాలంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి సుమారు 16 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేశాడు. 2. 29.11.2025న మేడికొండూరు పీఎస్ పరిధిలోని జగడగుండ్లపాలెం గ్రామంలో, ఇంటి తాళం తీసి బీరువాలోని సుమారు 20 గ్రాముల బంగారపు వస్తువులు దొంగతనం చేశాడు. 3. 10.12.2025న తెనాలి రూరల్ పీఎస్ పరిధిలోని హాఫ్‌పేట గ్రామంలో, ఉదయకాలంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి సుమారు 250 గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేశాడు.
*నిందితుడు నేరం చేసే విధానం :* నిందితుడు బీటెక్ పూర్తి చేసి 2024 వ సంవత్సరం నుండి ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తూ ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ లకి అలవాటు పడి, బెట్టింగ్ ఆడడానికి డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు చేసి వాటిని కూడా బెట్టింగ్ లో పోగొట్టుకొని, అప్పుగా కూడా డబ్బులు దొరక్కపోయేసరికి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే కోరికతో దొంగతనాలు చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది.
ఆ క్రమములో పలు గ్రామాలు తిరుగుతూ ఇంటికి తాళం వేస్తూ, ఆ తాళాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టి వెళ్ళే వారి ఇళ్లను గుర్తించి ఆ ఇళ్ళల్లో దొంగతనం చేస్తుంటాడు. అదేవిధంగా ఇంటికి తాళం వేసి ఉండి ఆ ఇంటి తాళం దొరక్కపోతే అట్టి తాళాన్ని పగలగొట్టి దొంగతనం చేస్తుంటాడు.
*చేదించిన విధానం:* కొల్లిపర పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన CC కెమారాలను పరిశీలించగా మున్నంగి గ్రామములో ఏర్పాటు చేసిన CC కెమారాలలో పరిశీలించగా బైక్ పై ఎవరో ముసుగు వేసుకుని ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం గమనించి, గుంటూరు జిల్లా శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాలతో తెనాలి DSP B. జనార్ధనరావు గారు, తెనాలి రూరల్ CI SK నాయిబ్ రసూల్ గార్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2025 డిసెంబర్ 30న నిందితుడిని పట్టుకొని, అతని వద్ద చోరీ సొత్తుని మొత్తాన్ని రికవరీ చేసి,అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుడిపై ఉన్న పాత కేసుల వివరములు:* నిందితుడిపై తెలంగాణ రాష్టంలోని హుజూర్ నగర్, చింతకాని మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్ లలో 3 దొంగతనం కేసులు నమోదు అయినవి. హుజూర్ నగర్ కేసులో జైలుకి వెళ్ళి రావడం జరిగినది. 📌 ప్రజలను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ… ఇంటికి తాళాలు వేసి ఏవైనా కార్యక్రమాలకు బయటకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇవ్వడం వల్ల ఆ ఇంటిపై నిఘా ఉంచి ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిఘాను పటిష్టం చేస్తామన్నారు. ప్రజలు వీలైనంత వరకు వారి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. LHMS సేవలను వినియోగించుకోవాలని తెలియజేసినారు.
👉 వరుస దొంగతనాల కేసులను చేధించి, దొంగతనం జరిగిన వెంటనే స్పందించి, చాకచక్యంగా 10 రోజులలోనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీ సొత్తు మొత్తం రికవరీలో ప్రతిభ కనబరిచిన తెనాలి DSP B. జనార్ధనరావు గారు, తెనాలి రూరల్ CI SK నాయిబ్ రసూల్ గారు, కొల్లిపర పోలీసుస్టేషన్ సబ్- ఇన్స్పెక్టర్ N C ప్రసాద్, కొల్లిపర పోలీస్ స్టేషన్ ASI-3306 A పోతురాజు, HC- 105 T రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు M కూర్మారావు, N పోతురాజు గార్లను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ఎస్పీ గారు అందజేసినారు.
