నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఉపేక్షించబోము జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్ల వద్ద పికెట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
బాపట్ల:
బాణాసంచా కాల్చడం, పరిమితికి మించిన ధ్వనితో డీజేలు ఏర్పాటు చెయ్యడం చట్ట విరుద్ధం
సైలెన్సర్ తీసివేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తూ వాహనాలను నడిపితే సీజ్ చేయడం జరుగుతుంది
యువతపై కేసులు నమోదైతే భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందడం కష్టతరమవుతుంది
ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఆహ్లాదకరంగా వేడుకలు జరుపుకోవాలి.
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్ల వద్ద పికెట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మద్యం సేవించి వాహనాలు నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, రణగొణ ధ్వనులతో వాహనాలను నడిపిన ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేయవద్దని, బైక్ ల సైలెన్సర్ లు తీసివేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తూ వాహనాలను నడిపినా, మద్యం సేవించి వాహనాలను నడిపిన సదరు వాహనాలను సీజ్ చేసి వాహన చోదకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు.
పరుస్తామన్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించబోమన్నారు. బాణాసంచా కాల్చడం, పరిమితికి మించిన ధ్వనితో డీజేలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువతపై కేసులు నమోదైతే భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాలలో చేరాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించాలన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి నమోదైన కేసులతో నూతన సంవత్సరంలో అడుగు పెడతారో (లేదా) నూతన సంతోషంతో కొత్తగా ఎంచుకున్న ఆశయాలను సాధించే లక్ష్యంతో నూతన సంవత్సరంలో అడుగుపెడతారో అనేది దృష్టిలో ఉంచుకొని యువత శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతులు లేకుండా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి ఒంటి గంట (1.00 AM) తర్వాత ప్రజలు రోడ్లపై తిరగరాదని తెలిపారు.
జిల్లా పోలీస్ అధికారులు డిసెంబర్ 31 బుధవారం రాత్రి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్ లను ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. బైక్ ల సైలెన్సర్ లు తీసివేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తూ నడిపే వాహనాలను సీజ్ చెయ్యాలని తెలిపారు.
#నరేంద్ర
