Thursday, January 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం

పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం

పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*

*మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్*

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, భద్రతాయుతంగా నిర్వహించేందుకు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.

ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్య కూడళ్లలో, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో, దేవాలయాలు.

హోటళ్లు, ప్రధాన రహదారుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు నైట్ ప్యాట్రోలింగ్‌ను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించారు.ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

మండలంలోని ప్రతి జంక్షన్‌ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలన్నారు.

అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, స్టంట్లు వేయడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు..మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఎవరైనా అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శబ్ద కాలుష్యం, గొడవలు, రోడ్లపై గుమిగూడటం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే చర్యలకు అనుమతి లేదన్నారు. యువత తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కోరారు..

అనుమానాస్పద లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ, “ప్రజల సహకారంతోనే శాంతియుత నూతన సంవత్సరం వేడుకలు సాధ్యమవుతాయి” అని ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments