APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025ని ప్రభుత్వం తరపున ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు.
డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APSET-2025) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష UGC నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడానికి ఇది ముఖ్యమైనది.
