Home South Zone Andhra Pradesh కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్

కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్

0

కర్నూలు సిటీ : కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన నివాస కార్యాలయంలో కార్మికులకు మిఠాయి బాక్సులు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతకన్నా ముందు కమిషనర్ తన సతీమణి పి.చంద్రకళతో కలిసి కార్మికులకు అల్పాహారం వడ్డించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రజారోగ్యం, ప్రాథమిక మానవ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలో కార్మికుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. అందుకే వారి సంక్షేమానికి నగరపాలక సంస్థ ఎప్పుడూ వెనకాడలేదన్నారు. కార్మికులకు వేతనాలు, కిట్లు వంటి సదుపాయాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలను కార్మికులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల అభ్యున్నతికి చట్టపరిధిలో సాధ్యమైన అన్ని సౌకర్యాలు ఎటువంటి జాప్యం లేకుండా కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా తహశీల్దార్ రవికుమార్, అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ యన్.చిన్నరాముడు,.

కార్యదర్శి నాగరాజు, డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఇంచార్జి ఎస్‌.ఈ. శేషసాయి, అకౌంట్స్ ఆఫీసర్ మురళి, ఎగ్జామినర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఓలు జునైద్, ఇశ్రాయేలు, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, రామకృష్ణ, మంజూర్ బాష, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు కమిషనర్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version