రామసముద్రం – పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న బండరాయిని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
