గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు ప్రముఖులు రానున్నారు.
మారిషస్ అధ్యక్షులు ధరమ్ బీర్ గోకుల్ (Dharambeer Gokhool, Hon’ble President of the Republic of Mauritius)
ఈ నెల 3వ తేదీన పట్టణానికి రానున్నారు.
4వ తేదీ ఉదయం10.30 గంటలకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ లో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొంటారు.
ఒడిశా గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు 3వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొంటారు.
5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు.
