కర్నూలు : డోన్ :
డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకలకు డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై,కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు.
ఆరోగ్యం మరియు అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుంచి పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు,మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.




