చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో చేరింది. వైసీపీ ప్రభుత్వ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడుగా విడిపోయింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు.
తంబళ్లపల్లె నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో భాగమయ్యాయి. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే కొనసాగించారు. ఎన్నికల హామీ మేరకు, మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తూ అన్నమయ్య జిల్లాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం కొత్త జిల్లా పరిధిలో బోర్డులు ఏర్పాటు చేశారు.
పుంగనూరు నియోజకవర్గం మదనపల్లెలో చేరడంపై ఎన్డీఏ కూటమి నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. 2026 తొలినుంచి పుంగనూరు అన్నమయ్య జిల్లాకు స్వాగతం పలికింది# కొత్తూరు మురళి.




