TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది.
ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్కు తరలించింది.
