Home South Zone Andhra Pradesh మార్క్ఫెడ్ కందుల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల

మార్క్ఫెడ్ కందుల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల

0

కర్నూలు : నంద్యాల  డోన్ : ప్యాపిలి :
ఈ రోజు ప్యాపిలి పట్టణంలో NCCF ఆధ్వర్యంలో ఏ.పీ. మార్క్‌ఫెడ్ నిర్వహించిన కందుల కొనుగోలు సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు *శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి* గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

రైతులు పండించిన కందులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ఉద్దేశంగా ఇటువంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు

Exit mobile version