Home South Zone Andhra Pradesh రైతులకు ఆర్థిక సహాయం : మంత్రి అచ్చెన్నాయుడు |

రైతులకు ఆర్థిక సహాయం : మంత్రి అచ్చెన్నాయుడు |

0

కర్నూలు
కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు టౌన్ లో ఉల్లిగడ్డ రైతులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఉల్లిగడ్డ రైతులు ధన్యవాద తీర్మాన సభలో వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చంనాయుడు గారితోపాటు KDCC ఛైర్మెన్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చంనాయుడు గారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 60000 వేల ఎకరాల్లో ఉల్లి ని రైతులు సాగు చేశారన్నారు.

ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి భారీ దిగుబడి జరిగింది కానీ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక రైతులకు కనీస పెట్టుబడి పెట్టిన డబ్బులు రాక రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి  తీసుకెళ్లగా ముఖ్యమంత్రివర్యులు వెంటనే స్పందించి మార్క్ఫేడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేయమని   .

ఆదేశాలివ్వగా 1,68,936 లక్షల క్వింటాలు కొనుగోలు చేశామన్నారు. తర్వాత ఉల్లి పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల దిగుబడి కూడా భారీగా పెరగడం వల్ల మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల రైతులకు నష్టపరిహారం అందజేయాలని భావించి ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో సుమారుగా 31,352 మందికి 99.92 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు.కూటమి రైతు ప్రభుత్వమని మరోసారి రుజువైందని తెలియజేశారు

KDCC ఛైర్మెన్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా జిల్లాలో మా కోడుమూరు రైతులు కూడా ఆదాయ వనరుగా ఎక్కువగా ఉల్లిని పండిస్తారు ఈ సారి వర్షం బాగా పడి దిగుబడి పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతులు ఆవేదన వ్యక్తం చేశారని ఇది గమనించి మా కోడుమూరు రైతులకు అలాగే జిల్లా రైతుల కు సుమారు 100 కోట్ల నష్ట పరిహారం అందించడం పట్ల ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి ,వ్యవసాయ శాఖ మాత్యులు సర్ కింజరాపు అచ్చంనాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు.

అలగే కోడుమూరు నియోజకవర్గానికి ముఖ్యంగా త్రాగు సాగు నీరు సమస్య ఉందని ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గానికి అభ్యర్థి గా కీ శే శ్రీ. రాజవర్ధన్ రెడ్డి గారి కి ఆప్తుడు అయిన శ్రీ బొగ్గుల దస్తగిరి గారిని నేను సిఫార్సు చేయగా నారా లోకేష్ గారు , చంద్రబాబు నాయుడు గారు  టికెట్ ఇచ్చారని ఇచిన వెంటనే జిల్లాలో అత్యధిక మెజారిటీ తో గెలుపొందడం జరిగిందన్నారు .ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబు నాయుడు గారికి , శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు .

మా నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక్క డైరెక్టర్ పోస్ట్ కూడా దక్కలేదని అయిన కూడా పదవుల కోసం ఎప్పుడూ ఆరాటపడం లేదని ఈ నియోజక వర్గ ప్రజలకి ఎల్లపుడు సేవ చేస్తాను పార్టీని బలోపేతం కోసం ఎప్పటికీ కృషి చేస్తానని పేర్కొన్నారు .

మంత్రివర్యులు శ్రీ TG భరత్ గారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువమొతంలో సాగుచేసిన  రైతులకు ఆర్థిక సాయం సుమారు 100 కోట్లు అందించడం పట్ల సర్ నారాచంద్రబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు.       కోడుమూరు నియోజకవర్గం MLA శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ మా నియోజకవర్గంలో 8890 ఉల్లి రైతులకు సుమారు 28 కోట్లను ఆర్థిక సాయం చేయడం పట్ల ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కింజరాపు అచ్చంనాయుడు గారికి ధన్వదాలు తెలిపారు.

అలాగే భవిష్యత్తులో ఉల్లి ధరలు తగ్గినప్పుడు ఉల్లిని అమ్ముకోకుండా నిల్వ చేసుకొని మరల ఉల్లి రేటు బాగా ఉన్నపుడు అమ్ముకోవడానికి అవసరమైన ఏసీ గోడౌన్స్ నిర్మించాలని  వ్యవసాయ శాఖ మాత్యులు వారికి విజ్ఞప్తి చేశారు. చివరగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు సమస్యలను సమిష్టిగా పరిష్కరిస్తే స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేసి తన ప్రసంగాన్ని ముగించడమైనది.

జిల్లాలో మిగతా నియోజవర్గ ఎంఎల్ఏ లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అందుకే ఉల్లి రైతులు నష్టపోకుండా 31,352 రైతులకు 99.92 కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాణ్యం MLA శ్రీమతి గౌరు చరితమ్మ గారు, పత్తికొండ MLA శ్రీ శ్యాంబాబు గారు, ఎమ్మిగనూర్ MLA శ్రీ జయనగేశ్వరరెడ్డి గారు, జిల్లా టీడీపీ  అధ్యక్షురాలు  శ్రీమతి  గుడిసె కృష్ణమ్మ గారు , మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు, ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి గారు, జిల్లా టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Exit mobile version