కర్నూలు
కర్నూలు జిల్లా…మంత్రి టీజీ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు. 2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు.
వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ గారిని సంకల్ బాగ్‌లోని మంత్రి గారి నివాసంలో డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఆకాంక్షించారు.
