ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశం
శుక్రవారం నాడు విజయవాడ రూరల్ మండలం ఇబ్రహీంపట్నం ప్రాంతం డాన్ బాస్కో స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏడిసిపి గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ జోన్ ఏసిపి దుర్గారావు, ట్రాఫిక్ ఏసిపి రామచంద్రరావు,రూరల్ డిఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో శనివారం సాయంత్రం 6 గంటలకు రోడ్డు ప్రమాదాల నివారణ పై ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో ఉన్న టిప్పర్ల లారీ యజమానులు, డ్రైవర్లు అందర్నీ పిలిపించి వారికి పలు సూచనలు జారీ చేశారు..
టిప్పర్ లారీలకు స్పీడ్ లిమిట్స్ పెట్టాలని, లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఓవర్ లోడ్ తో ప్రయాణించరాదని, లారీలకు జిపిఆర్ఎస్ అమర్చాలని, లారీ డ్రైవర్లకు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని,అలాగే లారీ యజమానులు అందరూ లారీల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయించాలని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపడతామని, రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే లారీ యజమానులతో పాటు డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు తప్పవని ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఈ సందర్భంగా విలేకరుల సమావేశం లో తెలిపారు.
