చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం MVI సుప్రియ నిర్వహించారు.
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని ఆమె సూచించారు.
పట్టణ ప్రజలు, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎమ్మార్వో రాము, సీఐ సుబ్బారాయుడు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి .
