Home South Zone Andhra Pradesh శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర : ఎమ్మిగనూరు

శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర : ఎమ్మిగనూరు

0

కర్నూలు
ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో  శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర (రథోత్సవం) సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు పట్టణంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా నూతన వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన లైటింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రాంతాలు.

శ్రీనివాస్ సర్కిల్ – SBI – ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు• సోమేశ్వర సర్కిల్• మాచాని సోమప్ప సర్కిల్• అంబేద్కర్ & గాంధీ సర్కిల్• కర్నూలు బైపాస్ రోడ్డు – నూతన సర్కిల్• శివ సర్కిల్• బస్ స్టాండ్ పరిసరాలు• అన్నమయ్య సర్కిల్వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే జాతర సందర్భంగా భద్రత, వెలుతురు, రాకపోకలు సజావుగా ఉండేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. జాతరను శాంతియుతంగా, ఘనంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version