Home South Zone Telangana ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|

ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కి చెందిన ఉదయ్ శ్రావణ్ ని నియమించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు శుక్రవారం ఉదయ్ శ్రావణ్ కి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భగా ఉదయ్ మాట్లాడుతూ… తనకు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను మనస్సాక్షిగా నిర్వహిస్తామన్నారు. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హోటల్స్ కూడా శుభ్రత పాటించాలని ప్రజలని కోరారు.

వినియోగదారులు హక్కులు కాపాడడం లో 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ అవసరం వచ్చిన మా NCRC హెల్ప్ లైన్ కి కాల్ చేయాలన్నారు, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.

కాగా ఎన్ సీఆర్ సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియమించబడిన ఉదయ్ కు పలువురు అభినందించడంతో పాటు శుభాకాంక్షలు తెలియచేశారు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version