మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానానికి భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ కరుణశ్రీ కందుకూరి, బలమైన మద్దతు తెలిపారు.
తుర్కపల్లి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో…
కరుణశ్రీ మాట్లాడుతూ…
కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల ఖర్చులు భారీగా తగ్గుతాయని, ప్రజలపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.ఎన్నికల కారణంగా పదే పదే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అమలుతో స్థిరమైన పాలన, వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి..మేడ్చల్–మల్కాజ్‌గిరి బీజేపీ కన్వీనర్ అంజలిదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనురాధ దేవి, విజయ్ మరియు కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వన్
నేషన్ – వన్ ఎలక్షన్ అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
#sidhumaroju.
