Home South Zone Andhra Pradesh గ్రామీణ అభివృద్ధికి చట్టాల సరళీకరణ |

గ్రామీణ అభివృద్ధికి చట్టాల సరళీకరణ |

0

గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.

బాపట్ల : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని “వికసిత్ భారత్–జి రామ్ జి”గా పేరు మార్చిన నేపథ్యంలో గ్రామ సభలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు.

ఈ పథకంపై రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను కలెక్టర్ గారు విడుదల చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, పెండింగ్‌లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఐజీఓటీ శిక్షణలను అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితా దరఖాస్తులు, రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు.

ఆర్మీ ఫ్లాగ్‌డే విరాళాల సేకరణలో వేగం పెంచాలని సూచించారు.
* వ్యవసాయ, వ్యవసాయేతర పంటలకు బ్యాంకుల నుంచి మంజూరయ్యే రుణాలను 10 శాతం పెంచాలని జిల్లాస్థాయి కమిటీ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ డా||వి. వినోద్ కుమార్,  ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో.

పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా రైతుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.* ధాన్యం, పొగాకు సహా 198 రకాల పంటల పెట్టుబడి రుణాలు పెంచేందుకు కమిటీ ఆమోదం తెలిపిందని, పొగాకు పంటకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. పాడి, మత్స్య, పశుపోషణ రంగాల అభివృద్ధిపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.* జిల్లా కమిటీ తీర్మానాలను రాష్ట్రస్థాయి కమిటీకి ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version