గుంటూరు జిల్లా పోలీస్…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ది.26.01.2026న అమరావతి రాజధానిలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు సంబంధించి, తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టు వైపు వెళ్లే రహదారి కుడి వైపున సిద్ధం చేస్తున్న వేడుకల నిర్వహణ ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ఈ రోజు పరిశీలించారు.
వేడుకల నిర్వహణ ప్రదేశాన్ని చిత్ర పటం (లేఅవుట్) ఆధారంగా సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు.
రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ముందస్తుగా చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విద్యాసాగర్ రావు గారు, తుళ్లూరు డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి. శ్రీనివాస్ గారు, తుళ్లూరు పోలీస్ స్టేషన్ సీఐలు K.శ్రీనివాసరావు గారు, ఎం. శ్రీనివాసరావు గారు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు గార్లు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.
